తృటిలో తప్పిన భారీనష్టం
సారథి, చొప్పదండి: చొప్పదండి మండలంలోని ఆర్నకొండ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి పలు వస్తువులు కాలిబూడిదయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో చొప్పదండి ఎస్సై వంశీకృష్ణ ఫైర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే బ్యాంక్ లోని మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, క్యాషియర్ రూమ్ లు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే ఉన్న లాకర్ రూమ్ కు మంటలు వ్యాపించేలోపు ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఆర్పివేశారు. పెద్దమొత్తంలో నష్టం వాటిల్లకుండా చేసినందుకు చొప్పదండి ఎస్సై వంశీకృష్ణతో పాటు గ్రామస్తులు ఫైర్ సిబ్బందిని అభినందించారు.