సామాజికసారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చల్లపల్లికి చెందిన పకాడి లక్ష్మయ్య, లక్ష్మమ్మ కూతురు స్రవంతి వివాహానికి శుక్రవారం మాజీ ఎంపీపీ పకాడి జయప్రకాశ్(జేపీ)రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. పేదలకు తనవంతు సహాయం చేస్తూ ఎళ్లవేళలా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. కాగా, లక్ష్మయ్య గతంలోనే చనిపోవడంతో రెక్కలకష్టంపై లక్ష్మమ్మ తన కూతురును చదివించి పెళ్లిచేస్తోంది. మాజీ ఎంపీపీ పకాడి జయప్రకాశ్ సాయం చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయనను గ్రామయువకులు, గ్రామస్తులు సత్కరించారు. కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు పి.శశికుమార్, జగదీశ్వర్, బస్వరాజ్, కొమ్ము విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- February 18, 2022
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Comments Off on పేదింటిబిడ్డ పెళ్లికి మాజీ ఎంపీపీ జేపీ సాయం