సారథి, బిజినేపల్లి: స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటామని నిరూపించారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన బి.శివారెడ్డి ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. తమవంతు సాయంగా అతని భార్య శ్రీదేవికి రూ.30వేలు పోగుచేసి ఆదివారం అందజేశారు. భవిష్యత్ లోనూ అతని భార్యాపిల్లలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. శివారెడ్డి స్నేహితులను గంగారం గ్రామస్తులు అభినందించారు. సహాయం అందజేసిన వారిలో శ్రీనివాసులు, అశోక్, శివకుమార్, నిరంజన్, సాధిక్ బాషా, శివ తదితరులు ఉన్నారు.
- June 6, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- BIJINEPALLY
- friends help
- GANGARAM
- గంగారం
- బిజినేపల్లి
- స్నేహితుల సాయం
- Comments Off on స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం