Breaking News

తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆర్థిక సాయం

తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆర్థికసాయం


సారథి, కొల్లాపూర్: కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తక్షణ సాయం కింద ప్రభుత్వం మంజూరుచేసిన రూ.రెండువేల ఆర్థిక సహాయం చెక్కులను గురువారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందజేశారు. నాగర్​కర్నూల్​జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో 10మంది చిన్నారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకట రమణమ్మ, ఐసీడీఎస్ నిరంజన్, సూపర్​వైజర్లు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల పంపిణీ
నిరుపేదలకు సీఎం రిలీఫ్​ఫండ్​వరంగా మారిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన కొల్లాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఎల్లూరు గ్రామానికి చెందిన కురుమూర్తికి రూ.60వేలు, పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బొక్కలయ్యకు రూ.25వేల విలువైన చెక్కును వారి కుటుంబసభ్యులకు అందజేశారు.