Breaking News

మహిళా టీచర్​, ఉపాధ్యాయుడి కామకేళి

మహిళా టీచర్​, ఉపాధ్యాయుడి కామకేళి
  • రెడ్​ హ్యాండెడ్ గా పట్టుకున్న ఉపాధ్యాయిని భర్త
  • ఇద్దరికీ దేహశుద్ధి.. పెద్దల సమక్షంలో పంచాయితీ
  • నాగర్​ కర్నూల్​ జిల్లాలో సంచనలమైన ఘటన

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయులే దారితప్పారు. విలువలను మరిచి కామకేళిలో మునిగిపోయారు. పవిత్రమైన వృత్తికే కళంకం తెచ్చారు. సదరు ఉపాధ్యాయిని భర్త రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకుని చితకబాదడం జిల్లాలో సంచలనంగా మారింది. నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం సాతాపూర్​ ప్రభుత్వ ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్​, ఉపాధ్యాయుడి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అది కూడా హద్దులు దాటింది. సదరు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుడు నాగర్​ కర్నూల్​ లోని వారి ఇంటిలో కామక్రీడకు దిగారు. పక్కా ప్లాన్​ తో ఆమె భర్త ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఇలాంటి పనులు చేయడం ఏమిటని సభ్యసమాజం ప్రశ్నిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *