Breaking News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

సారథి, పెద్దశంకరంపేట: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలో సహకార సంఘం ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. జొన్నలు క్వింటాలుకు రూ.2,620 చెల్లిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తోందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతన్నలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి అండగా ఉంటుందన్నారు. మండలంలోని ఆయా గ్రామాల రైతులు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, ఏఏసీఎస్ చైర్మన్ సిద్ధ సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేష్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేష్ గౌడ్, ప్రకాష్ వేణుగోపాల్ గౌడ్, మాణిక్ రెడ్డి, శంకర్ గౌడ్, యాదవ్, పీఏసీఎస్​డైరెక్టర్లు అంజయ్య, రవీందర్ పాల్గొన్నారు.