Breaking News

కరోనా ఉందని తప్పుడు రిపోర్టు

కరోనా ఉందని తప్పుడు రిపోర్టు
  • ఆస్పత్రిపై కేసు నమోదు

సారథి, వేములవాడ: కరోనా టెస్టుల్లో తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ కొవిడ్ ఆస్పత్రిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పట్టణ సీఐ వెంకటేశ్​ తెలిపారు. పోలీసుల కథనం.. చిట్టి మంగమ్మ అనే మహిళ స్వల్ప జ్వరం లక్షణాలతో మాతృశ్రీ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి సీటీస్కాన్, రక్తపరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని ఆమెకు సూచించారు.

సుమారు రూ.1.5లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో మంగమ్మ డబ్బులు లేక వేములవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్​ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పూర్తి విచారణ చేసి ఆస్పత్రి పై చర్యలు తీసుకుంటామని పట్టణ సర్కిల్ ఇన్​ స్పెక్టర్​ వెంకటేష్ తెలిపారు.