Breaking News

తునికాకు కల్లాల పరిశీలన

తునికాకు కల్లాల పరిశీలన

సారథి, తాడ్వాయి: వన్యప్రాణి విభాగం పరిధిలోని నర్సింగాపూర్ బీట్ తునికాకు కల్లాలను ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ధేశించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తిచేయాలన్నారు. ఆకుల కట్టలను గన్నీ బ్యాగుల్లో సక్రమంగా నింపాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. ఆయన వెంట ఎఫ్ డీ వో గోపాల్ రావు, తాడ్వాయి ఎఫ్ ఆర్వో షౌకత్ హుస్సేన్, సెక్షన్ ఆఫీసర్ కుమార్ స్వామి, బీట్ ఆఫీసర్లు శోభారాణి, శ్రీనివాస్ ఉన్నారు.