సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక డాక్టర్దాశరథి కృష్ణమాచార్యుల స్మారక పురస్కారం ప్రకటించడం హర్షణీయమని కొల్లాపూర్ కవులు, రచయితలు వేదార్థం మధుసూదన శర్మ, ఆమనికృష్ణ, డాక్టర్గూడెలి శీనయ్య, వేముల కోటయ్య, డాక్టర్రాంచందర్ రావు, మేనావత్ రాందాస్ నాయక్, గడ్డం వెంకటరమణ, ముమ్మిడి చంద్రశేఖరాచారి, పరశురాముడు తదితరులు బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతిగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, తెలుగుశాఖ అధ్యక్షుడిగా ఎన్నో హోదాల్లో ఆయన పనిచేశారని కొనియాడారు. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా తెలుగు భాషా అభివృద్ధి, వికాసానికి విశేషసేవలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేయడం కొల్లాపూర్ ప్రాంతానికి గర్వకారణమని కొనియాడారు.
- July 21, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- dasharathi puraskar
- KOLLAPUR
- yelluri shivareddy
- ఎల్లూరి శివారెడ్డి
- కొల్లాపూర్
- దాశరథి పురస్కారం
- Comments Off on ఎల్లూరి శివారెడ్డికి దాశరథి పురస్కారంపై హర్షం