సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు రూ.8,02,500 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ 8చంద్రశేఖర్ గౌడ్, ఎంపీపీ చిలుక రవీందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, మహేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
- July 12, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- choppdandi
- CM KCR
- RELIEF FUND
- చొప్పదండి
- సీఎం కేసీఆర్
- సీఎం సహాయనిధి
- Comments Off on పేదల సంక్షేమానికి కృషి