సామాజిక సారథి, ఎల్ బి నగర్: నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని నియోజకవర్గ ప్రజలు అధైర్యపడొద్దని ఎల్.బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సమస్యపై 4-5 రోజుల్లో పరిష్కారం కానున్న సమయంలో నాకు కరోనా రావడంతో సదరు కాలనీ వాసులు పరిష్కారం వాయిదా పడొచ్చని తెలిపారు. రాబోయే 5రోజుల్లో పరిష్కార మార్గం చూపుతామని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కాలనివాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, నాగోల్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిరంజీవి, బి.ఎన్.రెడ్డి, నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, న్యూటన్, యువజన విభాగం అధ్యక్షులు రాఘవేందర్ రావు, వైదేహి నగర్ పోగుల రాంబాబు, గుజ్జ జగన్ మోహన్, బి.ఎన్.రెడ్డి నగర్, నాగోల్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
- October 29, 2022
- Archive
- లోకల్ న్యూస్
- Comments Off on నాకు కరోనా వచ్చిందని అధైర్యపడొద్దు: ఎమ్మెల్యే