Breaking News

ఇతరుల వ్యవహారాలలో జోక్యం వద్దు

ఇతర వ్యవహారాల్లో జోక్యం వద్దు

నేటి రాశిఫలాలు
తేదీ: 24.4.20121
వారం: శనివారం

మేషం: కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు ఆశించినత సంతృప్తినీయవు. ప్రముఖుల కలయిక, బ్యాంకు వ్యవహారాలు ఒక పట్టాన పూర్తికావు. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ విషయాల్లో ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. వ్యాపార లావాదేవీలు, అగ్రిమెంట్ల విషయంలో ఏకాగ్రత వహించండి. మీ సంతానం గురించి ఆందోళన చెందుతారు.

వృషభం: విద్యార్థులకు పోటీ పరీక్షల ఏకాగ్రత, సమయపాలన అవసరం. బంధుమిత్రులతో కలహాలు వచ్చే సూచనలు ఉన్నవి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వలన మానసికంగా స్థిమితం ఉండదు. ఉద్యోగాల్లో అధికారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఉభయుల మధ్య సఖ్యత నెలకొంటుంది. రాజకీయ నాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేస్తారు.

మిథునం: గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందులెదుర్కొవలసి వస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబసభ్యులతో కొంత సమయం గడుపుతారు. వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘ కాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. దైవ, శుభకార్యాల్లో మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. క్రయ విక్రయాలు సామాన్యం.

కర్కాటకం: బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. మీ కళత్ర పట్టుదల, సంతానం మొండి వైఖరి వల్లచికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్లకు లొంగకుండా స్థిరచిత్తంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంటిలో బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వస్తువులు బహుమతిగా పొందుతారు. కుటుంబసభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. అద్దెఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

సింహం: బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. స్త్రీలకు పొదుపు పథకాలపై ఆసక్తి ఉంటుంది. పాతమిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. గృహప్రవేశం నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. వృత్తి,వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. తలపెట్టిన పనులు హడావుడిగా పూర్తిచేస్తారు.

కన్య: ఇతరుల శ్రేయస్సు కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. వృత్తిఉద్యోగ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఒడిడుకులు నుంచి బయటపడతారు. భూసంబంధిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ప్రైవేట్​, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి. ఇతరుల ముందు మరొకరి ప్రస్తావన మంచిదికాదు. ఎడతెగని ఆలోచనలతో మనస్థిమితం ఉండదు.

తుల: ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలోవారికి సంతృప్తి కానవస్తుంది. దూరదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తికావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దాయాదులతో ఊహించని వారితో వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో మానసిక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహంగా ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి.

వృశ్చికం: ఇంట బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉపాధ్యాయులకు బదిలీ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆలయ సందర్శనాల్లో పాల్గొంటారు. సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. పాతరుణాలు తీర్చడానికి చేసే నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఫ్యాన్సీ, కిరాణా, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి కలుగుతుంది.


ధనుస్సు: వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేయలేక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదాపడతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులుంటాయి. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పత్రిక, ప్రైవేట్​ సంస్థల్లోని వారికి ఓర్పు ముఖ్యం. గృహంలో మార్పులు, మరమ్మతులు వాయిదా పడతాయి.

మకరం: చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మీ సమర్థతపై మీకే నమ్మకం సన్నగిల్లుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. స్థిరాస్తికి వివాదాలకు సంబంధించి బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. స్త్రీలతో మిత సంభాషణ క్షేమదాయకం. ఎదుటివారి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మాటపడక తప్పదు. గృహంలో మార్పులు, చేర్పులకు చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది.

కుంభం: మీ అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. నూతన వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి నిలదొక్కుకుంటారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పొందుతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి.ఇంటిలో వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపరిచిత వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. జాగ్రత్త వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి.
మీనం: పాత బాకీలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. స్థిరచరాస్తుల మీడియా వారికి మిశ్రమ ఫలితం. తోటల రంగాల వారి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో ఏకాగ్రత వహించండి.

(మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేదీ ఆధారంగా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రెమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి.)

:: బ్రహ్మశ్రీ విప్పర్ల మహేశ్ విశ్వకర్మ గురూజీ,
ప్రముఖ జ్యోతిష్య పండితులు,
సెల్​నం.95020 59649