Breaking News

పేద పిల్లలకు బియ్యం పంపిణీ

పేద పిల్లలకు బియ్యం పంపిణీ

సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం జిల్లాకు చెందిన గాస్పల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొల్లారం గ్రామంలో పేద పిల్లలకు బియ్యం, ఇతర నిత్యవసర సరుకులను ఎంపీపీ శ్యామల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెంటర్ ఇన్​చార్జ్​నవీన్, పాస్టర్ శ్యామ్, సంస్థ సిబ్బంది మురళి కృష్ణారెడ్డి, అశోక్, సైదులు పాల్గొన్నారు.