సారథి, కోడేరు. అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలకు రూ.10 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. కోడేరు మండలానికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. కరోనా కారణంగా సంవత్సరన్నర కాలంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అభివృద్ధిని ఎక్కడా ఆపలేదన్నారు. 167 రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎంపీపీ కొండ రాధాసుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, సర్పంచ్ వెంకటస్వామి, మండల అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, గ్రామాధ్యక్షుడు శ్రీశైలం, రైతుబంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వరరావు, చంద్రశేఖర్ రెడ్డి, యాపచెట్టు లాలు, సింగిల్ డైరెక్టర్లు, తహసీల్దార్ మల్లికార్జున రావు పాల్గొన్నారు.
- July 27, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KOLLAPUR
- mla beeram
- ration cards
- ఎమ్మెల్యే భీరం
- కొత్త రేషన్‌కార్డులు
- కొల్లాపూర్
- Comments Off on లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ