సారథి, బిజినేపల్లి: ఆర్ఏహెచ్– యాక్ట్ పథకంలో భాగంగా రాయితీపై లబ్ధిదారులకు గడ్డి కత్తిరించే యంత్రాలను మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని నందివడ్డేమాన్ గ్రామానికి చెందిన నలుగురు, లట్టుపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని ఐదు గ్రామాలు లట్టుపల్లి, నందివడ్డేమాన్, సల్కర్ పేట, వసంతపూర్, వట్టెం గ్రామాలు ఈ పథకానికి ఎంపికైనట్లు వివరించారు. ఈ పథకంపై ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
- August 3, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- MLA MARRI
- RAH ACT
- ఆర్ఏహెచ్– యాక్ట్
- ఎమ్మెల్యే మర్రి
- బిజినేపల్లి
- Comments Off on రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాల పంపిణీ