సారథి, మానవపాడు: యునైటెడ్ వే ఆఫ్ ఇండియా బొంబాయి సంస్థ వారు రాజోలి చేనేత శ్రామిక సేవాసమితి వారి ఆధ్వర్యంలో రాజోలి గ్రామంలో వెయ్యి చేనేత కార్మిక కుటుంబాలకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా ఉండటంతో చేనేత మగ్గాలు నడవక చాలా కుటుంబాలకు తినడానికి కూడా తిండిలేక పస్తులు ఉంటున్నాయి. అలాంటి వారికి తమవంతుగా సాయం చేస్తున్నారు. చేనేత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కో ఆప్షన్ సభ్యుడు నిషాక్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు చేనేత కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటూ సహకారం అందిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అండగా ఉండాలని కోరారు. యునైటెడ్ వే ఆఫ్ ఇండియా సంస్థకు వెన్నంటి ఉంటామన్నారు. కార్యక్రమంలో రాజోలి ఎస్సై శ్రీనివాసులు, ఎంపీడీవో, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు నిషాక్ అహ్మద్, చేనేత శ్రామిక సేవాసమితి దర్జీ వీరేష్, యునైటెడ్ వే ఆఫ్ ఇండియా సభ్యులు ఉన్నారు.
- April 22, 2021
- Archive
- chenetha labour
- MANAVAPADU
- RAJOLI
- చేనేత కుటుంబాలు
- మానవపాడు
- యునైటెడ్ వే ఆఫ్ ఇండియా
- రాజోలి
- Comments Off on వెయ్యి కుటుంబాలకు సరుకులు పంపిణీ