Breaking News

వలస కార్మికులకు సరుకులు పంపిణీ

వలస కార్మికులకు సరుకులు పంపిణీ

సారథి, జగిత్యాల: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామ శివారులో పెద్దమ్మ తల్లి మ్యాంగో సెంటర్ లో కడార్ల రాజేశ్వర్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు గురువారం రూ.50వేల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లారెడ్డి, కౌన్సిలర్లు పంబాల రామ్ కుమార్, కుసరి అనిల్, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఆనంద్ రావు, ఏఎంసీ డైరెక్టర్ మోహన్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.