Breaking News

భక్తులు అప్రమత్తంగా ఉండాలి

భక్తులు అప్రమత్తంగా ఉండాలి

సామాజిక సారథి,  ఐనవోలు :  హన్మకొండ జిల్లా ఐనవోలు లోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో జనవరి 13 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐనవోలు దేవస్థానం లో విధులు నిర్వహిస్తున్న 11 నుండి 13 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని  వైద్యులు తెలిపారు. థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు భక్తులు అప్రమత్తంగా ఉండాలని,  భక్తులు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని  అధికారులు సూచించారు.