– అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
– టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి
సామాజిక సారథి , తెలకపల్లి : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో నిరుపేద ప్రజల సంక్షేమ బలహీనవర్గాలకు మేలు చేసే విధంగా పథకాలను ఏర్పాటు చేశారని కానీ నేటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో బలహీన వర్గాల సంగతి మరచి బి ఆర్ ఎస్ కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూచుకుల్ల రాజేష్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీలోకి ఇష్టంతో స్వచ్ఛందంగా వచ్చిన వివిధ పార్టీల నాయకులను, కార్యకర్తలను బి ఆర్ఎస్ నాయకులు భయభ్రాంతులకు గురిచేసి మళ్లీ తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు .
ఎంత చేసిన ప్రజల హృదయాలలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణా సౌకర్యం, యువతకు రెండు లక్షల ఉద్యోగాల వరకు భర్తీ చేస్తామని ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు చేస్తామని పెళ్లి చేసుకున్న మహిళలకు లక్ష రూపాయల నగదు తో పాటు తులం బంగారం అందజేస్తామన్నారు, ఆసరా పెన్షన్ 4000 వరకు పెంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండ పర్వతాలు, సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ మామిళ్ళపల్లి యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ ఎం బాలగౌడ్, బలుస శ్రీరాములు, మండల పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పర్వతాలు, గుగ్గిల ప్రకాష్, శ్రీను, శ్రీనివాస్ రెడ్డి రాముడు, స్వామి తదితరులు పాల్గొన్నారు.