సామాజిక సారథి, పెద్దశంకరంపేట: రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ షెట్కార్ అన్నారు. మెదక్జిల్లా పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కల, పెద్దశంకరంపేట ఎస్సీకాలనీల్లో దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో భాగంగా సభ ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ కేవలం ఎన్నికల కోసమే హుజరాబాద్ లో దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని విమర్శించారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా వర్తింప చేయాలని ఆయన అన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న సీఎం కేసీఆర్ ఊరికొక ఉద్యోగం ఇచ్చాడా? అని విమర్శించారు. సీఎం కేసీఆర్ దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి, ఇస్తాను అన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఎన్నికల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం సీఎం పనిచేయాలని హితవుపలికారు. యువకులు ఉద్యోగాలు రాక నిరుద్యోగంతో బాధ పడుతుంటే సీఎం కేసీఆర్ తెలంగాణ బంగారు తెలంగాణ అని ప్రజలను మభ్యపెడుతున్నారు, కేసీఆర్కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ వచ్చిందని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు సంజీవరెడ్డి, నారాయణఖేర్ నియోజకవర్గ ఇన్చార్జ్శశికళ యాదవ రెడ్డి, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జనార్ధన్, కాంగ్రెస్నాయకులు జైహింద్ రెడ్డి, మధు, రాజేంద్ర గౌడ్, సాయిరెడ్డి, నారాగౌడ్, మూసాపేట సర్పంచ్ అంజిరెడ్డి, ఎంపీటీసీ రాజు నాయక్, పేట తహసీల్దార్ చరణ్ సింగ్కు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.