సారథి, సిద్దిపేట: వ్యక్తిగత శుభ్రతతోనే కరోనా కట్టడి చేయచ్చని ఎంపీపీ లకావత్ మానస అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ కరోనా సింటమ్స్ అయిన జ్వరం, దగ్గు, తుమ్ములు, వాంతులు ఉంటే గ్రామాల్లో నిర్వహించే కొవిడ్ టెస్టు క్యాంపుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకొవాలన్నారు. అనంతరం గ్రామ సర్పంచి తొడేటి రమేష్ మాట్లాడుతూ గ్రామస్తులు శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్లు వాడుతూ వ్యక్తిగత శుభ్రతను పాటించాన్నారు. అనంతరం గ్రామంలో 149 మందికి కొవిడ్ టెస్టులు చేయగా 3 పాజిటివ్ కేసులు వచ్చినట్లు సర్పంచి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని సౌమ్య, ఎంపీటీసీ జయ, గ్రామ పాలకమండలి సభ్యులు, సెక్రెటరీ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి, కనుకయ్య, ఏఎన్ఎం లిల్లీ మేరీ, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్ననారు.
- June 3, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Camp
- HUSNABAD
- MPP
- Pandilla
- Sarpanchi
- Testing
- ఎంపీపీ
- క్యాంపు
- టెస్టింగ్
- పందిల్ల
- సర్పంచి
- హుస్నాబాద్
- Comments Off on వ్యక్తిగత శుభ్రతతోనే కరోనా కట్టడి