సారథి, రాయికల్: కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా వైరస్ నివారణ పరీక్షలు వేగవంతం చేయాలని కరీంనగర్ రాయికల్ మండల మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి చిలివేరి నాగరాజు అన్నారు. ప్రతిరోజు చేస్తున్న కరోనా ర్యాపిడ్ నిర్ధారణ పరీక్షలు సంఖ్యను పెంచాలన్నారు. వ్యాక్సిన్ కొరత అధికంగా ఉండటంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి మండల సామాజిక ఆరోగ్య కేంద్రానికి పెద్దఎత్తున ప్రజలు రావడంతో అక్కడ ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వైరస్ ఎక్కువ మందికి అంటుకునే ప్రమాదం ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆరోగ్య ఉపకేంద్రాలతో పాటు గ్రామాల వారీగా సెంటర్లను ఏర్పాటుచేసి వ్యాక్సిన్లు వేయాలన్నారు. కార్యక్రమంలో చంద అంజయ్య, ఊరెడి రవీందర్, ఊరెడి రాజయ్య, చిలివేరి సురేష్, కనికరపు లక్ష్మణ్, శేర్ల ప్రభాకర్ పాల్గొన్నారు.
- May 4, 2021
- Archive
- CARONA
- rapid tests
- raykal
- కరోనా సెకండ్ వేవ్
- రాయికల్
- ర్యాపిడ్ టెస్టులు
- Comments Off on కరోనా పరీక్షలు వేగవంతం చేయాలి