Breaking News

మహేశ్​బాబుకు కరోనా పాజిటివ్‌

మహేశ్బాబుకు కరోనా పాజిటివ్‌
  • త్వరగా కోలుకోవాలని చిరంజీవి, ఎన్టీఆర్​ ట్వీట్‌

సామాజిక సారథి, హైదరాబాద్: సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌ మీడియా ద్వారా నిర్ధారించారు. నాకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. అయితే నాతో కాంటాక్ట్‌ అయినవారంతా పరీక్ష చేయించుకోవాలని ఆయన ట్విట్టర్​ ద్వారా కోరారు. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్‌ తీసుకోలేదో వెంటనే తీసుకోవాని, ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండండని మహేశ్ సూచించారు. అయితే కరోనా బారిన పడిన మహేశ్​త్వరగా కోలుకోవాలని మెగాస్టార్​ చిరంజీవి, జూనియర్​ఎన్టీఆర్ లు ట్విట్​చేశారు. టాలీవుడ్‌ క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్​తమన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన అఫీషియల్‌ గా ఇంకా ప్రకటించనప్పటికీ ఇండస్ట్రీ వారు ధ్రువీకరిస్తూ ట్వీట్‌ చేశారు.