Breaking News

ఈవీఎం గోడౌన్ల నిర్మాణం చేపట్టాలి

ఈవీఎం గోడౌన్ల నిర్మాణం చేపట్టాలి

సామజిక సారథి, ములుగు ప్రతినిధి: జిల్లాలో ఈవీఎం గోడౌనల నిర్మాణం చేపట్టాలని ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం  జిల్లా కేంద్రంలో  కలెక్టర్ కార్యాలయం విచ్చేసిన ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ కి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డీఆర్వో రమాదేవి పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. అనంతరం  నూతనంగా నిర్మించిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను ఎలక్షన్ సీఈవో, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు.ఈవీఎం గోడౌన్ పరిశీలించి అత్యంత నాణ్యత ప్రమాణాలతో నిర్మించారని సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా 22 గోడౌన్ల నిర్మాణం చేపట్టగా నేటికి 20 పూర్తయ్యాయని నారాయణపూర్,  కామారెడ్డి జిల్లాలలో నిర్మాణ ప్రగతిలో ఉన్నాయని, ఈ నెలాఖరు లోగా వాటిని కూడా పూర్తి చేస్తామని, పోలీస్ బందోబస్తుతో ఈవీఎంలను ఈ గోడౌన్లలో భద్రపరిచి భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్మించేందుకు ఉపయోగిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో తాసిల్దార్ లు, బీ ఎల్ వో లతో సమావేశం నిర్వహించి ఎన్నికల నియమావళి,  స్పెషల్ సమ్మరీ రివిజన్, గరుడ యాప్, వాటర్ హెల్ప్ లైన్, ఆన్లైన్లో డెత్ వాటర్స్ లిస్టు రిమూవ్ చేయడం,  సంబంధిత వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ జిల్లాలో 300 పోలింగ్ కేంద్రాలు 2. లక్షల 14 వేల 897 మంది ఓటర్స్ ఉన్నా రని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ సమర్థ వంతమైన అధికార యంత్రాంగం తో బీ ఎల్ వో లకు గరుడ యాప్ ను ఉపయోగిస్తూ, ఎన్నికల నియమావళిని పాటిస్తూ గడువు తేదీలోగా అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఆర్ వో రమాదేవి,  ఏఎస్పీ సుదీర్ రంనాద్ కేకన్,  సంబంధిత అన్ని మండలాల తాసిల్దార్లు,  బీ ఎల్ వో లు పాల్గొన్నారు.