Breaking News

మంత్రి హరీశ్ రావుకు రాజేశ్​ రెడ్డి శుభాకాంక్షలు

మంత్రి హరీశ్ రావుకు రాజేశ్​రెడ్డి శుభాకాంక్షలు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: ఇటీవల వైద్యారోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి టి.హరీశ్​రావును ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి తనయుడు, తెలంగాణ డెంటల్​ డాక్టర్స్​ అసోసియేషన్ ​రాష్ట్ర అధ్యక్షుడు, యువనేత డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. అందుకు తమవంతు సహకారం ఉంటుందని చెప్పారు. వైద్య, ఆరోగ్యరంగానికి సంబంధించిన పలు విషయాలపై కొద్దిసేపు చర్చించారు.