సామాజిక సారథి, వైరా: ఖరీఫ్ సీజన్లో పండిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం విధించిన షరతులను సడలించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ వైరా మార్కెట్ లో ధాన్యం విక్రయించుకొనేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, సీఐటీయూ జిల్లా నాయకులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, రైతు సంఘం నాయకులు బెజవాడ వీరభద్రం, మాడపాటి వెంకట్, యనమద్ధి రామకృష్ణ, గుడూరు రమణారెడ్డి, వడ్లమూడి మధు, షేక్.బాబు, తూము సుధాకర్, నాగేశ్వరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
- December 4, 2021
- Archive
- లోకల్ న్యూస్
- Comments Off on కొనుగోలు కేంద్రాల్లో షరతులు సడలించాలి