వర్చువల్ ద్వారా ప్రారంభించిన హైకోర్టు సీజే
సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ లో మొదటి, 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు భవనాన్ని వర్చువల్ ద్వారా సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లీ హైదరాబాద్ నుంచి ప్రారంభించారు. నూతన కోర్టు ద్వారా కేసులు సత్వరం పరిష్కారమవుతాయని తెలిపారు. సివిల్ కోర్టు కేసుల విచారణకు ఇప్పటివరకు మహబూబ్ నగర్ లేదా హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రజలకు, న్యాయవాదులకు సమయంతో పాటు వ్యయప్రయాసాలు తగ్గిపోతాయని అన్నారు. బార్ అసోసియేషన్, న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్యఅతిథిగా హాజరైన మహబూబ్ నగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి టి.రఘురాం, కొల్లాపూర్ లోని సీనియర్ న్యాయవాదులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులు, కొల్లాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.