Breaking News

బిజినేపల్లిలో ‘ఆ నలుగురు’

బిజినేపల్లిలో ‘ఆ నలుగురు’
  • పత్రికల పేర్లు చెప్పి డబ్బులు వసూలు
  • యాత్రల పేరుతో జల్సాలు

సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో పలు దినపత్రికల పేరు చెప్పి పదిరోజుల నుంచి యాత్రల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఆ నలుగురిపై రెండు రోజులుగా మండలవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ‘ఆ నలుగురు’గా పిలువబడేవారు ఏటా రెండుసార్లు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఓ కారు తీసుకుని తెల్లవారింది మొదలు గ్రామాలపై పడి బెల్టుషాపులు, ఇసుక వ్యాపారులు, ఫర్టిలైజర్​దుకాణాలు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులకు టార్గెట్ గా ఇచ్చి తమ యాత్రకు డబ్బులు ఇవ్వాల్సిందేనని ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా వాళ్లు ఏకంగా మండలస్థాయి అధికారులను కూడా ప్రతి కార్యాలయానికి ఆ నలుగురు కలిసి వెళ్లి ఈ మండలానికి ‘‘మేమే.. బాసులం… మేము యాత్రలకు వెళుతున్నాం. మాకు చందా కావాల్సిందే” అని వారికి కూడా హుకుం జారీచేస్తూ వారి ఇంటివద్ద పడిగాపులు గాస్తూ డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు పదిరోజులుగా చర్చనీయాంశమైంది. ఏటా వీరు జెండా పండగ వచ్చిందింటే చాలు ప్రతి అధికారి వారికి కొంత ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. దీనికితోడు మళ్లీ అన్ని దినపత్రికల పేర్లు చెప్పి యాత్రల పేరుతో వేల రూపాయలు అడుగుతున్నారంటూ ప్రతి కార్యాలయంలోనే కాక ఎక్కడ కలిసిన నలుగురు ప్రజాప్రతినిధులు అదే గుసగుస ఇలాంటి వారిపై వారి యాజమాన్యాలు చర్య తీసుకుంటారా? లేక తామే పోలీసులకు ఫిర్యాదు చేయాలా? అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

One thought on “బిజినేపల్లిలో ‘ఆ నలుగురు’”

Comments are closed.