సారథి, పెద్దశంకరంపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోరా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి పెద్దశంకరంపేట మండలంలోని కొప్పోలు ఉమాసంగమేశ్వర ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ప్రత్యేకపూజలు జరిపించారు. ఆయన వెంట పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీలు వీణా సుభాష్ గౌడ్, స్వప్న రాజేశ్వర్, మల్లేశం, సుధాకర్, రాజేశ్వరి పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం
పెద్దశంకరంపేట మండలంంలోని బుజరంపల్లి, బూరుగుపల్లి, చీలపల్లి, ఆరేపల్లి గ్రామాల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి పల్లెప్రకృతి వనాల కేంద్రాలను ప్రారంభించారు. కమలాపురం, బుజరాన్ పల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.. పెద్దశంకరంపేటలో రూ.ఐదులక్షల వ్యయంతో చేపట్టిన మైనారిటీ సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేశారు. బుజ్రాన్ పల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. రైతులు కష్టపడి పండించిన పంటలను దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని కోరారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్.. వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీలు దత్తు, రాజు, వీణా సుభాష్ గౌడ్, స్వప్న రాజేశ్వర్, సర్పంచ్లు భూదెమ్మ విట్టల్, సరిత మల్లేశం, ప్రకాష్, రుక్మిణీ బాయి, శంకర్ రావు, జంగం రాఘవులు పాల్గొన్నారు.