Breaking News

చిల్డ్రన్స్ పార్క్.. నేచురల్​ మార్క్​

చిల్డ్రన్స్ పార్క్.. నేచురల్​మార్క్​

సామాజిక సారథి, వేములవాడ: మారుతున్న ప్రపంచంలో కాలుష్యం పెరిగిపోయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే ఆస్పత్రుల పాలవుతున్న నేటి తరుణంలో పార్కులు, మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్​రోడ్డులో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, మున్సిపల్​చైర్​పర్సన్​రామతీర్థపు మాధవిరాజు చొరవతో చిల్డ్రన్​పార్కును ఆకట్టుకునేలా ఏర్పాటుచేశారు. పట్టణ ప్రజలు, చిన్నారులకు ఆహ్లాదం పంచేలా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని సౌందర్యంతో రకకరాల మొక్కలను పెంచారు. పిల్లలను ఆకట్టుకునేలా అడ్వంచర్ జోన్లు, వంతెనలు ఇలాంటి ఎన్నో రకాల విశేషాలతో సందర్శకులను కనువిందు చేసేలా పార్క్​ను సరికొత్త హంగులతో రూపుదిద్దారు. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. రంగురంగుల బొమ్మలతో అలంకరించారు. ఇంకేందుకు ఆలస్యం మీరూ వెళ్లండి.