సారథి, వేములవాడ: వేములవాడ పార్వతీ సమేత రాజరాజేశ్వరస్వామి ఆలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉపాధ్యాయుల చంద్రశేఖర్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలయ ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో ఉద్యోగులు తమ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా సిరిగిరి శ్రీరాములు, గౌరవ సలహాదారులుగా సంకేపల్లి హరికిషన్ , ప్రధాన కార్యదర్శిగా పేరుక శ్రీనివాస్, ట్రెజరర్ గా ఒన్నారం భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా నక్క తిరుపతి, ఉపాధ్యక్షుడిగా వరి నరసయ్య, వెంకటలక్ష్మి, కార్యవర్గసభ్యులుగా అరుణ్ కుమార్, నునుగొండ రాజేందర్, గుండి నరసింహమూర్తి, ఎస్.కుమార్, తమ్మలి సంతోష్, పందిళ్ల శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి
పెండింగ్ లో ఉన్న మూడు ఏఈవో పోస్టుల ప్రమోషన్లు సమస్యను త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపాధ్యాయుల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఈవో చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఆలయ ఉద్యోగ సంఘ కార్యవర్గం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఆలయ ఉద్యోగులకు సంతాపం ప్రకటించింది. ఉద్యోగుల దీర్ఘకాలిక ఉద్యోగ పదోన్నతి సమస్యలు, ఉద్యోగ హెల్త్ కార్డ్ వయోపరిమితి పెంపు వంటి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
- June 10, 2021
- Archive
- rajarajeshwara swamy
- VEMULAWADA
- రాజరాజేశ్వరస్వామి
- వేములవాడ
- Comments Off on ఆలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్