సారథి న్యూస్, ములుగు: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రెండవ విడత ట్రైనింగ్ ఇచ్చారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, సహాయ ఎన్నికల అధికారి కె.రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్, పెద్ద బ్యాలెట్ బాక్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ డ్యూటీని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, డీఏవో శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్లు ఎస్.సతీష్ కుమార్, ఎస్.శ్రీనివాస్ రెడ్డి, పి.భాస్కర్, టి.కిషోర్, జడ్పీ సీఈవో ప్రసూన రాణి, మైక్రో అబ్జర్వర్స్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
- March 9, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- KHAMMAM
- MLC ELECTIONS
- NALGONDA
- WARANGAL
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఖమ్మం
- నల్లగొండ
- వరంగల్
- Comments Off on జాగ్రత్తగా ఎన్నికల డ్యూటీ చేయాలే