Breaking News

గృహోపకరణాలు దగ్ధం

గృహోపకరణాలు దగ్ధం

సామాజిక సారథి, చిలప్ చెడ్: మండల కేంద్రం చిలప్ చెడ్ లో షార్ట్ సర్క్యూట్ తో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి.  ప్రమాదసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం, స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గొట్టం మధు కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా చిట్కుల్ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన చాముండేశ్వరి ఆలయానికి వెళ్లారు. మధు ఇంటిలో నంచి పొగలు వస్తుండటం స్థానికులు గమనించారు. ఇంటిలోపలికి వెళ్లి చూడగా షార్ట్ సర్క్యూట్ వల్ల టీవీ, బీరువాలో ఉన్న దుస్తులు కాలిపోవడం చూసి కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. ఈ ప్రమాదంలో టీవీ, రెండు ఫ్యాన్లు, బీరువాలో ఉన్న విలువైన పట్టుచీరలు కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు.