జైభీమ్ యూత్ ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి
సామాజికసారథి, హైదరాబాద్: రామంతాపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో దళిత, గిరిజన విద్యార్థులకు బుక్కులు ఇవ్వకుండా వివక్ష చూపడం సరికాదని జైభీమ్ యూత్ ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడ 1 నుంచి 12వ తరగతి వరకు 300 మంది చదువుతున్నారని తెలిపారు. సంక్షేమ శాఖ నుంచి డబ్బులు రాలేదనే సాకుతో బుక్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని సరికాదన్నారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్న ప్రిన్సిపల్ నర్సింహారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి సస్పెండ్ చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ విద్యార్థుల తల్లిదండ్రులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ కు ఎస్సీ డీడీ కమిషనర్ యోగితారాణా లేఖ రాసినా సంక్షేమశాఖ వద్ద నిధులు లేవనే సాకుతో విద్యార్థులకు బుక్స్ ఇవ్వడం లేదన్నారు. రామంతాపూర్ లోని హైదరాబాద్లోని పబ్లిక్ స్కూలులో చదువుతున్న విద్యార్థుల చదువులను ఫణంగా పెట్టవద్దని ప్రభుత్వాన్ని ముకురాల శ్రీహరి కోరారు. తక్షణమే పుస్తకాలను పంపిణీ చేయకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూలును ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
Wonderful keep it on. Your dedication and commitment are very important for the society.
Wonderful keep it on.
Thanks for your motivational messages.