సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ లాల్ సింగ్ ఆర్యా ఉదయం దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులతో వేదోక్తంగా ఆశీర్వచనం తీసుకున్నారు. వారికి ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ లడ్డూప్రసాదం అందజేసి స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆయన వెంట మంత్రి శ్రీనివాస్ తో పాటు రాజన్న సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఎర్రం మహేష్ తదితరులు ఉన్నారు.
- July 16, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- bjp sc morcha
- rajanna temlpe
- VEMULAWADA
- బీజేపీ ఎస్సీ మోర్చా
- రాజరాజేశ్వరస్వామి
- వేములవాడ
- Comments Off on రాజన్న సన్నిధిలో బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్