సారథి, కోడేరు(కొల్లాపూర్): కోడేరు మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో విషజ్వరాల బారినపడిన ప్రతిఒక్కరినీ ఇంటింటికి తిరిగి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాలనీలో ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటుచేసి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్ఆస్పత్రికి తీసుకెళ్తామన్నారు. అంబులెన్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామన్నారు. అలాగే రైతుబీమా వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రఘువర్ధన్ రెడ్డి, సర్పంచ్ వెంకటస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు శ్రీశైలం, చంద్రశేఖర్ రెడ్డి యాపచెట్టు లాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- August 11, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KOLLAPUR
- mla beeram
- ఎమ్మెల్యే బీరం
- కొల్లాపూర్
- Comments Off on విషజ్వరాల బారినపడిన వారికి మెరుగైన వైద్యం