Breaking News

బాధిత కుటుంబానికి మాజీ ఎంపీపీ సాయం

బాధిత కుటుంబానికి మాజీ ఎంపీపీ సాయం

సామాజికసారథి, వెల్దండ: మండలంలోని చల్లపల్లి గ్రామానికి చెందిన బండ్ల శ్రీనివాస్ ​ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్​ సీనియర్ ​నాయకుడు, వెల్దండ మాజీ ఎంపీపీ పి.జయప్రకాశ్​ అతని కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.ఐదువేల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. పేదకుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. మృతుడు బండ్ల శ్రీనివాస్​ పిల్లలకు గురుకులాల్లో మంచి విద్యను అందించేందుకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు జగదీశ్వర్, వినోద్ తో పాటు పలువురు గ్రామస్తులు ఉన్నారు.