Breaking News

ఆర్మీ జవాన్ మిస్సింగ్​

ఆర్మీ జవాన్ మిస్సింగ్

సామాజికసారథి, సిద్దిపేట: గతనెల 17న సెలవుపై వచ్చి కనిపించకుండా పోయిన ఆర్మీ జవాన్ బూకూరి సాయికిరణ్ రెడ్డి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతరెడ్డిపల్లికి చెందిన సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్ గా ఎంపికై పంజాబ్ లోని ఫరిద్ కోట్ రెజిమెంట్​లో విధులు నిర్వహిస్తున్నాడు. గతనెల 17న అక్కడి నుంచి సెలవుపై ఇంటికొచ్చాడు. తిరిగి ఈనెల 5న తిరిగి డ్యూటీలో చేరడానికి ఇంటినుంచి బయలుదేరి వెళ్లి శంషాబాద్ విమానాశ్రయంలో 9 రాత్రి గంటలకు విమానం ఎక్కి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టెర్మినల్​2లో దిగినట్లు సీసీ ఫుటేజీ రికార్డు నమోదైంది. ఢిల్లీ నుంచి లోకల్ ట్రైన్ లో ఫరిద్ కోట్​కు మరో జవాన్, లోకల్ వైద్యుడు మనీష్ తో కలిసి బయలుదేరినట్లు సీసీ పుటేజీ ఆధారంగా తెలుస్తోంది. సాయికిరణ్ రెడ్డి కెప్టెన్ నిఖిల్ శర్మకు రిపోర్ట్ చేయాల్సి ఉంది. మరుసటి రోజు బతిండియాలో ఆ ఇద్దరు దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత సాయికిరణ్ రెడ్డి ఆచూకీ లభించలేదు. అతని తండ్రి పటేల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాయికిరణ్ చివరిసారి 6న హర్యానా లోని జకాన్ మండి నుంచి ఫోన్​లో మాట్లాడి సెల్​ఫోన్​ సిగ్నల్​లొకేషన్ ​చూపుతోంది. ఈ విషయాలను కెప్టెన్ నిఖిల్ సామకు వివరించామని, ప్రత్యేక బృందాలతో ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు. అడిషనల్​డీసీపీ(అడ్మిన్) శ్రీనివాసులు తెలిపారు.