సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు సాయం వానాకాలం పంటకాలానికి గాను మంగళవారం నుంచి రైతుఖాతాలో జమ చేయనునందున స్థానిక టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర రైతులందరికీ ప్రతి ఎకరాకు రూ.ఐదువేల పంట పెట్టుబడి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి రైతు బాంధవుడు అని కొనియాడారు. కార్యక్రమంలో రైతుబంధు మండలాధ్యక్షుడు జూపాక కరుణాకర్, ఎంపీటీసీలు మడి శ్యామ్, నాయకులు ఎడవెల్లి పాపిరెడ్డి రెడ్డి, మాజీ సర్పంచ్ అశోక్ కుమార్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లంక మల్లేశం, రామచంద్రారెడ్డి, రైతు మండల అధ్యక్షుడు కొడిమ్యాల రాజేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాగం లచ్చయ్య పాల్గొన్నారు
- June 15, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CM KCR
- RYTHU BANDHU
- telnagna
- తెలంగాణ
- రైతుబంధు
- సీఎం కేసీఆర్
- Comments Off on ముఖ్యమంత్రి రైతు బాంధవుడు