సారథి,పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు రైతుబంధు పథకం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను జమచేయడంతో పెద్దశంకరంపేటలో సీఎం కేసీఆర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చిత్రపటాలకు మంగళవారం ప్రజాప్రతినిధులు, పలువురు రైతులు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో 1.50 లక్షల ఎకరాలకు గాను 63.25లక్షల మంది రైతులకు రూ.7,058.78 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేష్, సర్పంచ్ సత్యనారాయణ, సహకార సంఘం చైర్మన్ సంజీవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, నాయకులు వీణాసుభాష్ గౌడ్, యాదుల్, రవీందర్, కోణం అంజయ్య, పున్నయ్య, రవీందర్, ఆర్యన్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
- June 15, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CM KCR
- NARAYANKHED
- PEDDASHANKARAMPET
- నారాయణఖేడ్
- పెద్దశంకరంపేట
- సీఎం కేసీఆర్
- Comments Off on సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం