Breaking News

అభాగ్యుడిపై ‘అమ్మ’ప్రేమ

అభాగ్యుడిపై ‘అమ్మ’ప్రేమ

సామాజిక సారథి, వాజేడు: దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆర్థిక సహాయం అందజేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం అరుణాచలపురం గ్రామానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్ రెండేళ్లుగా ఎర్రరక్తకణాలకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యచికిత్సల కోసం రెండెకరాల భూమిని కూడా అమ్ముకున్నాడు. మూడు రోజుల క్రితం వరంగల్ లోని లలిత ఆర్థోపెడిక్ ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్లాడు. బిల్లు కట్టలేని పరిస్థితుల్లో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థను సంప్రదించాడు. స్పందించిన సంస్థ నిర్వాహకుడు కృష్ణబాబు రూ.4వేలు అందజేశాడు. ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థను గ్రామస్తులు, యువకులు అభినందించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పీర్ల రామకృష్ణ, పీర్ల దిలీప్, బర్ల కోటేశ్వరరావు, పూనెం రాంబాబు, ఏవీఎస్ పీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రావు, వార్డుసభ్యుడు దబ్బకట్ల సాయమ్మ, చిక్కుడు వెంకటేశ్వర్లు, చిక్కుడు రజిని, గ్రామస్తులు పాల్గొన్నారు.