- ఉదయం బీఆర్ఎస్, రాత్రి కాంగ్రెస్‌కు జై
- పొట్టకూటి కోసం ‘పటేల్’ కోటితిప్పలు!
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్‌లో ఓ యువకుడు సోషల్ మీడియాతో మైండ్ గేమింగ్ ఆడుతున్నాడు. ఉదయం బీఆర్ఎస్, రాత్రి కాంగ్రెస్‌కు జై కొడుతుంటాడు. గతంలో బీజేపీకి సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా ఉండి బీఆర్ఎస్ నేతల చేతుల్లో చావుదెబ్బలు తిన్నాడు. అవేవీ పట్టించుకోకుండా బీఆర్‌ఎస్‌లో సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా చేరి తనకు గుర్తింపు కోసం నానాతంటాలు పడుతుంటాడు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దృష్టిలో పడేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలపై సోషల్ మీడియాలో పోస్టులు చేసి నానాహంగామా చేయడం అలవాటుగా మారింది. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు రాత్రిపూట కాంగ్రెస్ పార్టీ నేతలకు ఫోన్లు చేసి ’అన్నా.. నాకు గత్యంతరం లేక పోస్టులు పెడుతున్నాను. మీరు ఏమీ అనుకోవద్దు’అని బతిమాలుకోవడం పరిపాటిగా మారింది. ఇలా నాగర్‌కర్నూల్‌లో సోషల్ మీడియాలో ‘ఓ పటేల్’ వ్యవహారంపై ఇరువర్గాలు మైండ్ గేమ్ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి కమిట్‌మెంట్ లేని సదరు యువకుడు మళ్లీ జర్నలిస్టులపైనా దష్ర్పచారం చేయడంపై స్థానికులు నవ్వుకుంటున్నారు.