సారథి, కోడేరు(కొల్లాపూర్): నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు ప్రభుత్వ పశువైద్య కేంద్రంలో మూగజీవులకు మందులను అందుబాటులో ఉంచకుండా ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్న పశు వైద్యాధికారి డాక్టర్ భానుకిరణ్ పై చర్యలు తీసుకోవాలని యాదవ సంఘం మండల గౌరవాధ్యక్షుడు యాపట్ల శేఖర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మందులు సరఫరా చేస్తుండగా, ఆయన మాత్రం మందులు ఇవ్వకుండా నాగర్ కర్నూల్, సింగోటంలోని ప్రైవేట్మెడికల్ షాపునకు చీటీలు రాస్తున్నారని పేర్కొన్నారు. రైతులు, గొర్రెల కాపరుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మందులను సింగయిపల్లిలో నిల్వచేసి ప్రైవేటు వ్యక్తులకు బ్లాక్ లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. పశువైద్యాధికారి నిర్వాకంతో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయని వాపోయారు. సమావేశంలో యాదవ సంఘం నాయకులు నాగేష్, కృష్ణయ్య, స్వామి, శాఖాపూర్ స్వామి, బాలపీరు పాల్గొన్నారు.
- July 21, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- kodaire
- KOLLAPUR
- SINGOTAM
- కొల్లాపూర్
- కోడేరు
- పశువైద్యం
- Comments Off on ‘ప్రైవేట్‌లో మందులు విక్రయిస్తున్న డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి’