Breaking News

ఓ చిన్నపొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది

ఓ చిన్నపొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది

నేటి రాశిఫలాలు
తేదీ: 23.7.2021
శుక్రవారం

1.మేషం: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. రాజకీయరంగంలో ఉన్న వారికి గణనీయమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబసభ్యులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులు సత్ఫలితాలు పొందుతారు.

2.వృషభం: కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా కొనసాగుతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బందులు పడతారు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారంలో స్వల్పలాభాలు అందుతాయి. ఉద్యోగులకు స్థానచలనం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు కొంత నిరాశ కలిగిస్తాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిదికాదు. ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

3.మిథునం: ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. దాయదులతో భూవివాదాలు నెలకొంటాయి. కొన్ని వ్యవహారాల్లో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీ విషయంలో ఓ చిన్నపొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతాయి.

4.కర్కాటకం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పాతమిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం నెలకొంటుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీయొచ్చు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు కలిసివస్తాయి.

5.సింహం: మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆటోమొబైల్, ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి జయం కలుగుతుంది. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. విద్యార్థులు వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల వేళ అపరిచిత వ్యక్తులతో అప్రమత్తతంగా ఉండాలి.

6.కన్య:నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు కలుగుతాయి. కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులు ద్వారా స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ఆదాయం కొంత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో గృహంలో ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పు పొందుతారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు.

7.తుల:ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఆదాయం తగ్గి నూతన రుణాలు తీసుకుంటారు. దూరప్రయాణం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక కొంత నిరాశ పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలు ఉంటాయి. విదేశీయానం, రుణప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఏ విషయంలోనూ మనస్థిమితం అంతంగా ఉండదు.

8.వృశ్చికం: అదనపు ఆదాయం ద్వారా రుణాలు తీర్చగలుగుతారు. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. గొప్ప గొప్ప అవకాశాలు మీ దరిచేరుతాయి. గృహంలో సంతాన వివాహ శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావాల్సిన వస్తువులను కొంటారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి.

9.ధనస్సు: ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో ఇంటిలో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి సత్ఫలితాలు ఇస్తాయి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఓర్పు, నేర్పుతో మీరు అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి.

10.మకరం: ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి కొత్త సమస్యలు తెచ్చుకోకండి. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. సన్నిహితులతో కలిసి శుభాకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యం పెంపొందుతుంది. బ్యాంకు పనులు వాయిదాపడతాయి. ఆకస్మిక ఖర్చులు కొంత ఆందోళన కలిగిస్తాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు.

11.కుంభం:చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి పథంలో కొనసాగుతాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. దీర్ఘకాలిక రుణాలను తీరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. నిరుద్యోగులకు అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటిలో మార్పులు, చేర్పులు చేస్తారు. కీడు తలపెట్టే స్నేహానికి దూరంగా ఉండండి.

12.మీనం: మీరు చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వచ్చే ఆదాయానికి తగినట్లుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు ఉంటాయి. వ్యాపారంలో సొంత ఆలోచనలు చేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. పోస్టల్, టెలిగ్రామ్​రంగాల వారికి ప్రోత్సాహం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. ఉపాధ్యాయుల తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రేమికులు పెద్దల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు.
:: బ్రహ్మశ్రీ విప్పర్ల మహేశ్ విశ్వకర్మ గురూజీ,
ప్రముఖ జ్యోతిష్య పండితులు,
సెల్ నం.95020 59649

(మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన మాలాంటి గురూజీలను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రెమిడీలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి.)