సారథి, హైదరాబాద్: వరద నీటితో ఎలాంటి ఇబ్బందులు పడకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ పనులు చేపడుతున్నామని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎల్‌బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హయత్ నగర్ డివిజన్ లోని ఆంధ్రకేసరి నగర్ రోడ్డు నం.1లో రూ.75 లక్షలతో, బీజేఆర్ కాలనీ నుంచి జీహెచ్ఎంసీ లిమిట్స్ వరకు రూ.58.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న వరద నీటి కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గుడాల మల్లేశ్, ఆయా కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- April 2, 2021
- Archive
- హైదరాబాద్
- LB NAGAR
- mla devireddy sudhirreddy
- mrdc chairmen
- ఎంఆర్‌డీసీ చైర్మన్
- ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
- ఎల్‌బీనగర్
- వరద
- Comments Off on వరద సమస్యకు శాశ్వత పరిష్కారం