సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి) : ప్రభుత్వం మొక్కలు నాటే మహాయజ్ఞంలో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరో విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ రావు తెలిపారు. గురువారం తెలంగాణకు హరితహారం 6వ విడతలో భాగంగా సైదాబాద్ డివిజన్, ఎల్ఐసీ కాలనీ లోని వివేకానంద పార్క్ లో దేవీప్రసాద్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో రాబోయే తరాలకు బంగారు, పసిడి ఆకుపచ్చని తెలంగాణ అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి, మున్సిపల్ అధికారులు, ఎల్ఐసీ కాలనీవాసులు పాల్గొన్నారు.
- June 26, 2020
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- హైదరాబాద్
- BAVERAGES
- DEVIPRASAD
- సైదాబాద్
- హరితహారం
- Comments Off on 6వ హరితహారంలో 30 కోట్ల మొక్కలు