సారథి న్యూస్, హుస్నాబాద్: 5వేల ఎకరాలకు ఒక్క రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. శనివారం కోహెడ మండలం శనిగరం గ్రామంలో రూ.22లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు వేదిక భవనానికి భూమిపూజ చేశారు. రైతులను రాజులు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అనంతరం ఉపాధిహామీ పథకంలో భాగంగా శనిగరం ప్రాజెక్టు కింద ఉన్న బెజ్జంకి కాల్వ మరమ్మతు పనులను ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
- June 20, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- HUSNABAD
- MLA SATHISH
- సతీష్ కుమార్
- హుస్నాబాద్
- Comments Off on 5వేల ఎకరాలకొక రైతువేదిక