Breaking News

23 నుంచి వనమహోత్సవ్​

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి పరిధిలోని అన్ని కార్యాలయాల్లో, స్థలాల్లో ఈ నెల 23 నుంచి వనమహోత్సవ్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సంస్థ సీఎండీ శ్రీధర్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెత్తం 35 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బుధవారం కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేకకార్యదర్శి అనిల్​ కుమార్​ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్​ పాల్గొని మాట్లాడారు. బొగ్గు పరిశ్రమలన్నీ ఈ ఏడాది ‘వనమహోత్సవ్​’ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి సీఎండీ శ్రీధర్​ మాట్లాడుతూ.. తాము సింగరేణి ఆధ్వర్యంలో నర్సరీలోను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సింగరేణి అడ్వయిజరీ ( అటవీ) కే సురేంద్రపాండే, డెరెక్టర్​ బీ భాస్కర్​రావు, జనరల్​ మేనేజర్​ కే రవిశంకర్​ తదితరులు పాల్గొన్నారు.