ఓటీటీలో సినిమాలు విడుదలవుతూ కొత్త ట్రెండ్స్ సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ‘మహానటి’ సినిమాతో టాప్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ సినిమా జూన్ 19న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా అంచనాలు పెంచేందుకు ఆదివారం చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేస్తోంది. మహానటి తర్వాత కీర్తిసురేష్ నటించిన చిత్రం ఇదే కావడంతో పెంగ్విన్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఫ్యాషన్ స్టూడియోస్ పతాకంపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ టు రిలీజ్ స్లాట్ లో తమ సబ్ స్క్రైబర్స్ కు అందిస్తోంది.
- June 6, 2020
- సినిమా
- KEERTHI
- PENGUINS
- TEAJER
- కీర్తిసురేష్
- మహానటి
- స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
- Comments Off on 19న పెంగ్విన్ రిలీజ్