సారథి న్యూస్, అలంపూర్: ఈనెల 13 నుంచి 19 వరకు బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాలను మూసివేస్తున్నట్లు అలంపూర్ ఆలయాల ఈవో ప్రేమ్‌కుమార్ పేర్కొన్నారు. అలంపూర్‌లో దర్గా ఉర్సు సందర్భంగా వారం రోజుల పాటు అధికసంఖ్యలో భక్తులు పాల్గొంటే కొవిడ్-19 వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో ఆలయాల్లో అర్చకులు నిత్యపూజలు నిర్వహించి మూసివేస్తారని, ఉభయ ఆలయాల దర్శనాలకు భక్తులకు అనుమతి లేదన్నారు. భక్తులు దేవస్థానం వారికి సహకరించి 13 నుంచి 19వ తేదీ వరకు దర్శనాలకు రాకుండా విరమించుకోవాలని ఈవో కోరారు.
- July 9, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- ALAMPUR
- COVID19
- JOGULAMBA
- అలంపూర్
- ఉర్సు ఉత్సవాలు
- జోగుళాంబ
- Comments Off on 13 నుంచి అలంపూర్ ఆలయాల మూసివేత